ETV Bharat / state

'దురుసుగా ప్రవర్తించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?'

లాక్​డౌన్​లో ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 22 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది.

author img

By

Published : Apr 17, 2020, 6:56 PM IST

high court inquiry about register cases against police
'దురుసుగా ప్రవర్తించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?'

అత్యవసర పరిస్థితుల్లో బయటకెళ్లిన సాధారణ ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. లాక్​డౌన్​లో దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఈ నెల 22 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు అద్భుతంగా సేవలు చేస్తున్నప్పటికీ.. అక్కడక్కడా కొందరు అమానవీయంగా ప్రవర్తించడం బాధాకరమని న్యాయవాదులు​ పేర్కొన్నారు. వనపర్తి ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించగా.. అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సస్పెన్షన్​తో పాటు ఇంకేమేం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఈ నెల 22 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చదవండిః 'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.