ETV Bharat / state

ఫీజులపై నియంత్రణ కలేనా?.. హైకోర్టు ఆదేశించి ఏడాది!

బడి ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ ఉత్తర్వులను చాలా పాఠశాలలు గాలికొదిలేస్తున్నాయి. కమిటీ సిఫారసులపై విధానాన్ని రూపొందించి తమకు 2020 ఏప్రిల్‌ 9 నాటికి నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏడాది గడుస్తున్నా దాన్ని రూపొందించలేదు. గత సెప్టెంబరు నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆరోపిస్తోంది.

fees regulation in telangana, high court on fees regulation
ఫీజుల నియంత్రణ, ఫీజు నియంత్రమపై హైకోర్టు ఆదేశాలు
author img

By

Published : Apr 4, 2021, 7:31 AM IST

కరోనా కాలంలో బడి ఫీజులపై ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కొన్ని పాఠశాలలు అధిక రుసుములు వసూలు చేస్తున్నాయని తేలినా.. విద్యాశాఖ మాటలకే పరిమితమవుతోంది. ఫీజుల నియంత్రణకు శాశ్వత విధాన రూపకల్పనపై తాత్సారం చేస్తోంది. పాఠశాలల రుసుములను నియంత్రించేందుకు ఓయూ మాజీ ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు కమిటీ 2017 డిసెంబరు, ఆ తర్వాత కొన్ని వివరణలపై సమాధానాలను పొందుపరుస్తూ 2018 జూన్‌లో నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినా ఇప్పటివరకు దానిపై ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్పష్టం చేయలేదు.

ఏడాది గడుస్తున్నా

ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులపై దాఖలైన కేసుల్లో 2020 మార్చి 11న విచారణ సందర్భంగా కమిటీ సిఫారసులపై విధానాన్ని రూపొందించి తమకు 2020 ఏప్రిల్‌ 9 నాటికి నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడాది గడుస్తున్నా దాన్ని రూపొందించలేదు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల కొంత జాప్యం జరిగినా.. గత సెప్టెంబరు నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) ఆరోపిస్తోంది. విద్యాశాఖ స్పందించకుంటే త్వరలో కోర్టు ధిక్కరణ కింద వ్యాజ్యం దాఖలు చేస్తామని హెచ్‌ఎస్‌పీఏ సంయుక్త కార్యదర్శి వెంకట్‌ సాయినాథ్‌ తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరానికి రుసుములు ఎలా?

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ బోర్డు పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి గత నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ప్రవేశాలను ఖరారు చేశాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశం ఇచ్చే ముందు రుసుం ఎంతో తెలపాలి. అది తెలియకుండా ప్రవేశాల ప్రక్రియను ఎలా చేపట్టాయని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఫీజు ప్రస్తుత విద్యా సంవత్సరమంతేనా? లేదా గతంలో మాదిరిగా పెంచుకోవచ్చా.. అన్నదానిపై ఇప్పటివరకు విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఆ శాఖ జారీ చేసిన కాలపట్టిక ప్రకారమే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలి. రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరం వరకు అదే జరిగింది. ఈసారి అది గాడి తప్పింది.

ఇదీ చదవండి: కర్ణాటక మత్తు దందాలో కదులుతున్న డొంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.