ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, పింఛనులో కోతపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులు తెరిచాక విచారణ జరపాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోరగా... ఇప్పటికే చాల ఆలస్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న తరువాత తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.
లాక్డౌన్ సమయంలో ఆదాయం తగ్గినందున ఆర్థిక లోటును పూడ్చేందుకు ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు విశ్రాంత ఉద్యోగులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
ఇదీ చూడండి: సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!