AP HIGH COURT ON GO NO-59 : గ్రామ వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు జారీ చేసిన జీవో నెం.59ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు.
గ్రామ వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అదే సమయంలో జీవో నెం.59తోపాటు, వారికి డ్రెస్‌కోడ్‌ను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వారిని ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా.. విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి. AP High Court: ఆ పత్రం ఇచ్చిన మూడు నెలల్లో పరిష్కరించండి: హైకోర్టు
AP High Court: 'ఇలాగైతే.. అత్యవసర వ్యాజ్యాలనూ తిరస్కరించే పరిస్థితి వస్తుంది'