ETV Bharat / state

ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా: హైకోర్టు

author img

By

Published : Feb 11, 2021, 4:13 PM IST

Updated : Feb 11, 2021, 8:14 PM IST

ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా: హైకోర్టు
ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా: హైకోర్టు

16:10 February 11

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్​పాత్​ల ఆక్రమణలు తొలగించాలని... జీహెచ్​ఎంసీని హైకోర్టు ఆదేశించింది. నగరవ్యాప్తంగా సర్వే చేసి ఫుట్​పాత్​లు లేని ప్రాంతాలను గుర్తించి.. నిర్మించాలని స్పష్టం చేసింది. ఫుట్​పాత్​లు లేకపోతే పాదచారులు గాల్లో నడుస్తారని అధికారులు అనుకుంటున్నారా అని... ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫుట్​పాత్​ల ఆక్రమణలపై న్యాయవాది మామిడాల తిరుమలరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. 

  కొన్ని ప్రాంతాల్లో ఫుట్​పాత్​లు లేవని, మరికొన్ని ప్రాంతాల్లో కబ్జా అయ్యాయని... దానివల్ల పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని పిటిషనర్ వాదించారు. ఫుట్​పాత్​లు పాదచారులు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని... హైకోర్టు పేర్కొంది. వీధివ్యాపారుల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారా అని ధర్మాసనం అడిగింది. వీధివ్యాపారులు సహా ఎవరూ ఫుట్​పాత్​లను ఆక్రమించడానికి వీల్లేదని.. ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫుట్​పాత్ ఆక్రమణలు, తొలగింపునకు చర్యలు, కొత్తగా నిర్మాణం తదితర వివరాలతో... 4 వారాల్లో నివేదిక సమర్పించాలని జీహెచ్​ఎంసీ, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పిటిషన్​పై ఏప్రిల్ 15న విచారణ చేపడతామని... తమ ఆదేశాలు అమలు కాకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ఇదీ చూడండి: మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్

Last Updated : Feb 11, 2021, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.