ఏపీలోని నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. సుధాకర్ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నామని న్యాయవాది తెలిపారు.
సుధాకర్ పోలీసు, జుడీషియల్ కస్టడీల్లో ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ఆదేశించారు. సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంపై నమ్మకం ఏంటని ప్రశ్నించారు. సుధాకర్ ఆరోగ్య వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వ న్యాయవాది రెండ్రోజుల సమయం కోరారు. తదుపరి విచారణ సమ్మర్ వెకేషన్ తరువాత కొనసాగుతుందని న్యాయమూర్తి వెల్లడించారు.
ఇదీ చదవండి: 'దేశం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది'