కొవిడ్-19 పరీక్షలపై న్యాయవాది తిరుమలరావు వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నారని పిటిషనర్ వాదించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం కరోనా పరీక్షలు ఎవరికి చేస్తున్నారో మే 13లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు