ETV Bharat / state

మూడు నెలలు బియ్యం తీసుకోకపోతే.. సాయం ఆపేస్తారా? - hc hearing on pil of 1500 rupees for rations card holders

తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ 1500 రూపాయల ఆర్థిక సాయం చేయాల్సిందేనన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో... ఈనెల 22లోగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నేపథ్యంలో పేదలకు అందించిన 1500 రూపాయల సాయం నిలిపివేతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ts high court hearing on 1500 hundred repees for white ration card holders case
తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు
author img

By

Published : Jun 9, 2020, 10:25 PM IST

రేషన్​తో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 1500 రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం అమలు చేయక పోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో రేషన్ తీసుకోలేదన్న సాకుతో... 1500 రూపాయలు నిలిపివేశారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేవరకు తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు నెలలు ఉచిత బియ్యం తీసుకోకపోతే ఇచ్చే సాయం నిలిపివేయాలన్న నిబంధన ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో ఈనెల 22లోగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: చైనాలో కరోనా వ్యాప్తి ఆగస్టులోనే.. ఇవే సాక్ష్యాలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.