ETV Bharat / state

High Court: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి: హైకోర్టు - కరోనా నిబంధనలు

కేసులను ఏ విధానంలో విచారణ చేపట్టాలన్న దానిపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రత్యక్ష విచారణ సందర్భంగా న్యాయవాదులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

High Court
కేసుల ప్రత్యక్ష విచారణపై హైకోర్టు
author img

By

Published : Sep 9, 2021, 5:31 PM IST

కేసుల ప్రత్యక్ష విచారణకు హాజరయ్యే న్యాయవాదులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. కేసు ఉన్న న్యాయవాదులకే లోనికి అనుమతి ఉంటుందని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టులో కేసులను ఆన్​లైన్​ లేదా ప్రత్యక్ష విచారణపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆన్​లైన్​, ప్రత్యక్ష విచారణ వివరాలను వారం మొదట్లోనే న్యాయమూర్తులు ప్రకటిస్తారని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్​ తీసుకున్న వారికే అనుమతి

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష విచారణ సందర్భంగా న్యాయవాదులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కింది కోర్టులు ఎలా నిర్వహించాలనే అంశంపై స్థానిక పరిస్థితుల ఆధారంగా న్యాయమూర్తి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. జిల్లా న్యాయాధికారి, ఉద్యోగులు, న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చూడండి: HIGH COURT: 'హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.