ETV Bharat / state

'చీఫ్ జస్టిస్​ ముందుకు మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు' - రిట్ పిటిషన్లు

మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. న్యాయ వివాదాలు కొలిక్కి రావడం లేదు. మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ జరిగిన విచారణలో... వ్యాజ్యాలన్నీ ధర్మాసనం ముందుంచాలని సింగిల్ జడ్జి నిర్ణయించారు.

'చీఫ్ జస్టిస్​ ముందుకు మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు'
author img

By

Published : Oct 31, 2019, 9:32 PM IST

'చీఫ్ జస్టిస్​ ముందుకు మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు'

మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లలో లోపాలు జరిగాయంటూ 71 మున్సిపాలిటీలకు సంబంధించి హైకోర్టులో 81 వేర్వేరు పిటిషన్లు వేశారు. సింగిల్ జడ్జి వద్ద ఈ వ్యాజ్యాలన్నీ దాఖలయ్యాయి. వీటిపై ప్రస్తుతం స్టే అమల్లో ఉంది. మరోవైపు మరికొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా వేశారు.

సింగిల్ జడ్జి ముందు విచారణ:

ఐదు రోజుల క్రితం ప్రజా ప్రయోజనాల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్​తో కూడిన ధర్మాసనం... వాటన్నింటిని కొట్టేసింది. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి పలు మున్సిపాలిటీల ఎన్నికలపై వేర్వేరుగా స్టే విధించారు. వాటిపై జస్టిస్ చల్లా కోదండరాం ఇవాళ విచారణ చేపట్టారు. ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కొట్టి వేసినందున... రిట్ పిటిషన్లన్నీ కలిపి విచారణ జరిపి కొట్టివేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు న్యాయస్థానాన్ని కోరారు.

ప్రధాన న్యాయమూర్తి ముందుకు అన్ని పిటిషన్లు:

పిటిషనర్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల్లో పిటిషనర్లు కోరింది వేరని... రిట్ పిటిషన్లలో తాము కోరింది వేరని వాదించారు. తమ పిటిషన్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటరు దాఖలు చేయలేదని వాదించారు. తమ వాదన వినకుండా పిటిషన్లను తేల్చవద్దన్నారు. ఇవే ఆరోపణలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో విచారణ జరిపి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కొట్టివేసిందని అదనపు ఏజీ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి... పిటిషన్లన్నీ కలిపి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుంచుతామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్​తో చర్చిస్తా: పవన్

TG_HYD_41_31_HC_ON_MUNCIPAL_ELECTIONS_AV_3064645 REPROTER: Nageshwara chary NOTE: Pls Use File Visuals ( ) మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు సంబంధించిన న్యాయ వివాదాలు కొలిక్కి రావడం లేదు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలన్నీ ధర్మాసనం ముందుంచాలని హైకోర్టు సింగిల్ జడ్జి నిర్ణయించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏర్పాట్లలో లోపాలు జరిగాయంటూ 71 మున్సిపాల్టీలకు సంబంధించి 81 వేర్వేరు పిటిషన్లు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద దాఖలయ్యారు. మరోవైపు మరికొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాలను విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం వాటిని ఇటీవల కొట్టివేసింది. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి పలు మున్సిపాల్టీల ఎన్నికలపై వేర్వేరుగా స్టే ఉంది. వాటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఇవాళ విచారణ చేపట్టారు. ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కొట్టి వేసినందున... రిట్ పిటిషన్లన్నీ కలిపి విచారణ జరిపి కొట్టివేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు ఇవాళ న్యాయస్థానాన్ని కోరారు. అయితే పిటిషనర్లు దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల్లో పిటిషనర్లు కోరింది వేరని... రిట్ పిటిషన్లలో తాము కోరింది వేరని వాదించారు. తమ పిటిషన్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటరు దాఖలు చేయలేదని.. స్టే తొలగించాలని వ్యాజ్యం దాఖలు చేయలేదని వాదించారు. తమ వాదన వినకుండా పిటిషన్లను తేల్చవద్దన్నారు. ఇవే ఆరోపణలను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో విచారణ జరిపి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కొట్టివేసిందని అదనపు ఏజీ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి... పిటిషన్లన్నీ కలిపి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుంచుతామని పేర్కొన్నారు. end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.