సమాజంలో సహకారం లోపించడం వల్లనే నేరాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనలో ఎవరో ఒకరు సహకారం అందించినట్లైతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం, సహకార సంఘాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం సరైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సహకారం అందిస్తున్న సొసైటీలపై కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి