పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరతతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని పేర్కొంది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని... సగం పోస్టులు ఖాళీ ఉంటే సత్వర న్యాయం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది.
పీపీల నియామకానికి చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. 414 పీపీ పోస్టుల్లో 212 భర్తీ అయ్యాయని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై చర్చలు కాదు... ఫలితాలు కావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని పేర్కొన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో 2 వారాల్లో నివేదిక సమర్పించాలని... తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.