High court on Zonal Allotments: నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వలేమని హైకోర్టు పునరుద్ఘాటించింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు శ్వేత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.
petition on zonal system: భార్యభర్తల కేటగిరికీ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. భార్యభర్తల్లో ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. జీవోలో అలాంటి ప్రస్తావన లేనందున ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.
high court comments on zonal system: పాత, కొత్త జిల్లాలకు మధ్య ఎక్కువ దూరం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. ఎక్కడో ఉన్న సియాచిన్‌కు వెళ్లి చలిలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: