ETV Bharat / state

తెదేపా మేనిఫెస్టోపై పిల్‌ కొట్టివేత - ఏపీ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెదేపా మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో...బాధ్యులపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ దాఖలైన పిల్​ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై పిల్ ఏవిధంగా వేస్తారని ప్రశ్నించింది.

HC
తెదేపా మేనిఫెస్టోపై పిల్ కొట్టివేత
author img

By

Published : Mar 2, 2021, 6:57 AM IST

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెదేపా మేనిఫెస్టో విడుదలపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌సీఈ) చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై పిల్‌ ఏ విధంగా వేస్తారని ప్రశ్నించింది. ఎస్‌ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే చట్ట నిబంధనల మేరకు తగిన వేదికను ఆశ్రయించొచ్చని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తెదేపా మేనిఫెస్టో విడుదల చేసిందని పేర్కొంటూ కె.శివరాజశేఖర్‌రెడ్డి వేసిన పిల్‌పై న్యాయవాది జి.శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని ఎస్‌ఈసీ తెదేపాకు సూచించిందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో విడుదల చేస్తే.. తెదేపా అధినేతపై చర్యలు తీసుకోవాలని ఎలా కోరతారంటూ ప్రశ్నించింది. చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై అసహనం వ్యక్తం చేసింది. పిల్‌కు విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టేసింది.

'పుర' ఎన్నికలపై పిల్‌పై జోక్యానికి నిరాకరణ

నిలిచిపోయిన దగ్గర నుంచి పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలను పునఃప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 15న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. కరోనా కారణంగా ఎస్‌ఈసీ ఎన్నికలు వాయిదా వేయడాన్ని, నిలిచిపోయిన దగ్గర నుంచి ప్రక్రియను ప్రారంభిస్తామంటూ పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసింది. ఎస్‌ఈసీ, ఏపీ ప్రభుత్వం వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపండి

పురపాలక ఎన్నికల విషయంలో జోక్యానికి నిరాకరిస్తూ ఫిబ్రవరి 26న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్‌ దాఖలు చేశామని, వాటిపై అత్యవసరంగా విచారణ జరపాలని సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పీ.వీరారెడ్డి సోమవారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. గతంలో నిలిచిపోయిన దగ్గర నుంచి ప్రక్రియను పునఃప్రారంభిస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఆ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. సోమవారం విచారణ సాధ్యం కాదని, మంగళవారం విచారణకు వస్తే పరిశీలిస్తామని తెలిపింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యాజ్యాలపై విచారణ వాయిదా

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు విచారణను ఈనెల 5కు వాయిదా వేశారు. 4వ తేదీ నాటికి పిటిషనర్లకు కౌంటర్‌ ప్రతులను అందజేయాలని సూచించారు.

బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేయలేని వారు, వేధింపుల కారణంగా నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారు అందజేసిన వివరాల్ని పరిగణనలోకి తీసుకొని నివేదికలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏకగ్రీవాన్ని నిర్దారిస్తూ ఎన్నికల అధికారి ఫామ్‌-10 ఇచ్చిన చోట ఏవిధమైన విచారణ జరపవద్దని, ఫామ్‌-10 ఇవ్వనిచోట ఏదైనా చర్యలు తీసుకొని ఉంటే.. వాటిని ప్రకటించొద్దని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి : జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.