కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలుగా భౌతిక విచారణను తగ్గించిన హైకోర్టు సెప్టెంబర్ 7 నుంచి తిరిగి పరిమిత సంఖ్యలో భౌతిక విచారణ చేపట్టాలని పేర్కొంది. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులను అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆర్ఎస్ చౌహన్, బి.విజయ్‌సేన్ రెడ్డిల ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ల అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం సెప్టెంబర్ 7 నుంచి పరిమితంగా భౌతిక విచారణలు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాలను ఇప్పుడు అత్యవసరంగా తేల్చాల్సిన అవసరం లేదని.. అలాంటి పిటిషన్లు కోర్టులు పూర్తిగా తెరిచిన తర్వాత విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. అత్యవసర కేసులు మాత్రం పరిమిత సంఖ్యలో భౌతిక విచారణ జరపాలని నిర్ణయించింది.
ఇవీ చూడండి: 'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'