ETV Bharat / state

High court CJ: తెలంగాణలో 33 జ్యుడీషియల్​ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం - justice hima kohli speech on state judiciary

హైకోర్టులో జడ్జీల నియామక ప్రక్రియ చేపట్టామని.. ఇటీవల కొన్ని పేర్లు పంపించినట్టు హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ వెల్లడించారు. రాష్ట్రంలో 33 జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని జస్టిస్​ తెలిపారు. కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ వీలైనంత త్వరలో పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీజే పేర్కొన్నారు. కొవిడ్​తో మరణించిన కోర్టు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జస్టిస్ హిమా కోహ్లీ భరోసా ఇచ్చారు. ఉన్నత న్యాయస్థానం ప్రాంగణంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

high-court-chief-justice-justice-hima-kohli-speech-on-state-judiciary
హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ
author img

By

Published : Aug 15, 2021, 1:34 PM IST

Updated : Aug 15, 2021, 3:41 PM IST

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి చర్యలు చేపట్టినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. జడ్జీల నియామకం కోసం ఇటీవల కొన్ని పేర్లు పంపించినట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తిగత చొరవతో హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగిందని జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగులో అంశాన్ని పరిష్కరించినందుకు సీజేఐకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 33 జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని.. దీనిపై న్యాయమూర్తుల సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు జస్టిస్​ హిమా తెలిపారు. కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించామని.. కరోనా పరిస్థితులను బట్టి వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

High court CJ: తెలంగాణలో 33 జ్యుడీషియల్​ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం

ఈ మేరకు హైకోర్టులో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. పంద్రాగస్టు వేడుకల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

కరోనా సమయంలో.. సిబ్బంది సహకారంతో

ఈ ఏడాది కరోనా రెండో దశ తీవ్ర పభావం చూపిందని.. ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారారని సీజే హిమా కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానంలో 240, జిల్లాల్లో 1,288 న్యాయ సిబ్బంది, రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 235 న్యాయవాదులు కొవిడ్​ బారిన పడ్డారని జస్టిస్​ వెల్లడించారు. కరోనాతో 19 మంది ఉద్యోగులు, 208 మంది న్యాయవాదులు మరణించారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కొవిడ్​తో మరణించిన కోర్టు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని.. కుటుంబాల్లోని అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టామని సీజే తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సిబ్బంది సహకారంతో కోర్టులు నిరాటంకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 8వేల 300 మంది న్యాయ సిబ్బందికి, 2900 మందికి న్యాయవాదులకు కరోనా వ్యాక్సినేషన్​ పూర్తైనట్లు జస్టిస్​ హిమా కోహ్లీ పేర్కొన్నారు.

నూతన పోస్టులు

ఉన్నత న్యాయస్థానంలో ఈ ఏడాది 31,168 కొత్త పిటిషన్లు దాఖలు కాగా.. 22,098 కేసులు పరిష్కారం అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. హైకోర్టులో ప్రస్తుతం 2 లక్షల 32 వేల కేసులు పెండింగ్​లో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంతృప్తికరంగా ఉందని సీజే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 46 కొత్త కోర్టులు, 2,170 అదనపు పోస్టులు, హైకోర్టులో 213 సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసిందని వివరించారు.

దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష తొలగింపునకు.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు తన భార్య జ్ఞాపకార్థం ఇచ్చిన అంబులెన్స్​ను సీజే హిమా కోహ్లీ ప్రారంభించారు. హైకోర్టు కొవిడ్ సహాయ నిధి నుంచి పలువురు న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చట్టసభల పనితీరుపై జస్టిస్​ రమణ కీలక వ్యాఖ్యలు

Last Updated : Aug 15, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.