హైదరాబాద్లోని జియాగూడ డంపింగ్ యార్డు స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్న లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. జనావాసాల మధ్య డంపింగ్ యార్డు నుంచి వెలుపడుతున్న దుర్వాసన వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని స్థానికుడు పవన్ కస్తూరి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ, పీసీబీని హైకోర్టు ఆదేశించింది.
ఇవీచూడండి: ధర్మాన్ని పరిరక్షించాలి.. పరీక్షించకూడదు: సచ్చిదానంద స్వామి