ETV Bharat / state

High Court: న్యాయవాదులు, క్లర్కులు, స్టెనోలు, టైపిస్టులను అడ్డుకోవద్దు - telangana varthalu

లాక్​డౌన్ వేళల్లో న్యాయవాదులు, వారి క్లర్కులు, స్టెనోలు, టైపిస్టులను అడ్డుకోవద్దని ఆదేశిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోనూ నియంత్రించవద్దని స్పష్టం చేసింది.

High Court
న్యాయవాదులు, క్లర్కులు, స్టెనోలు, టైపిస్టులను అడ్డుకోవద్దు
author img

By

Published : Jun 2, 2021, 8:21 PM IST

లాక్​డౌన్ వేళల్లో న్యాయవాదులు, వారి క్లర్కులు, స్టెనోలు, టైపిస్టులను అడ్డుకోవద్దని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోనూ నియంత్రించవద్దని స్పష్టం చేసింది. సాయంత్రం 5 వరకు ఈపాస్​లతో న్యాయవాదులు బయటకు వెళ్లవచ్చునని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణీత వేళలు విధించడం, ఈపాస్ అడగటం సరికాదని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ... బార్ కౌన్సిల్ లేదా బార్ అసోసియేషన్ గుర్తింపు కార్డు చూపితే న్యాయవాదులను అనుమతించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. క్లర్కులు, స్టెనోలకు న్యాయవాదులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అయితే స్వేచ్ఛను న్యాయవాదులు, వారి క్లర్కులు, స్టెనోలు, టైపిస్టులు దుర్వినియోగం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. న్యాయవాదులను ఆపవద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని హోంశాఖ, డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డు చూపినప్పటికీ.. న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: high court: మెడపై కత్తి పెట్టి డబ్బులిప్పించాలి.. తల నరికేస్తే ఏం లాభం?:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.