ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో హైదరాబాద్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. పాతబస్తీలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలు నిఘా పెట్టాయి. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఉన్నతాధికారులతో కలిసి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సీపీ పర్యటించారు. పాతబస్తీలోనూ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. 144వ సెక్షన్ అమల్లో లేదని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.
ఇవీచూడండి: ఆపరేషన్ కశ్మీర్: భగ్గుమన్న రాజ్యసభ