ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ సంస్థ పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల అభివృద్ధికి ముందుకొచ్చింది. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో సంగారెడ్డి జిల్లాలోని మంబాపూర్ - నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ పార్థసారధి రెడ్డి రూ.5 విలువైన చెక్కును ప్రభుత్వానికి అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పాటు పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల స్ఫూర్తితోనే అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నామని హెటిరో ఛైర్మన్ తెలిపారు.
ఈ అటవీ ప్రాంతాన్ని తగిన రక్షణాత్మక చర్యల ద్వారా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. దత్తత కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. అటవీశాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలను హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. పర్యావరణ స్ఫూర్తితో ముందడుగు వేయటం అత్యంత అభినందనీయమని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఇటీవల సినీనటుడు ప్రభాస్, తాజాగా హెటిరో సంస్థ, త్వరలోనే మరికొందరు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు కూడా ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల