ETV Bharat / state

వస్త్రాభరణాల ప్రదర్శనలో సినీనటి రాశీసింగ్​ సందడి - heroine rashi singh inaugurated costumes and jewellery exhibition

బంజారాహిల్స్​లో ఓ వస్త్రాభరణాల ప్రదర్శనను సినీనటి రాశీసింగ్​ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.

heroine rashi singh, fashion exhibition
సినీనటి రాశీసింగ్​, తాజ్​ డెక్కన్​లో వస్త్రాభరణాల ప్రదర్శన
author img

By

Published : Apr 8, 2021, 5:26 PM IST

వస్త్రాభరణాల ప్రదర్శనలో సినీనటి రాశీసింగ్​ సందడి

వర్ధమాన సినీనటి రాశీసింగ్‌ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాశీసింగ్‌తో పాటు మిస్‌ యూనివర్శ్‌ ఇండియా అర్చన, నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విభిన్న రకాల స్టాల్స్‌ను సందర్శించారు. కెమెరాకు పోజులిస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు.

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దాదాపు 300 మంది డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను నగరవాసులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాలు, డిజైనర్‌ వేర్‌, సాంప్రదాయ కంచిపట్టు చీరలు ఇలా మగువలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాభరణాలను అందిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్​ సేవలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.