హైదరాబాద్ చింతల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల షోరూంను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించింది. వివిధ రకాలైన వస్త్రాలు, ఆభరణాలను ధరించి కనువిందు చేసింది.
కాజల్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులతో చింతల్ ప్రాంతం సందడిగా మారింది. అభిమానులందరినీ కలవడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
ఇదీ చూడండి : చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత