TARAKA RATNA HELATH UPDATES : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో సినీనటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్ పడిపోవడంతో ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదని.. లోబీపీ వల్ల స్పృహ తప్పి పడిపోయారని స్పష్టం చేశారు. కుప్పం ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ నటుడు బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానుల తాకిడికి ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. అనంతరం లక్ష్మీపురం మసీదుకు లోకేశ్‌తో పాటు వెళ్లారు.
బయటకు తిరిగి వచ్చిన తర్వాత పాదయాత్రలో అభిమానుల తాకిడితో తారకరత్న ఇబ్బంది పడ్డారు. గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సెక్యూరిటీ సిబ్బంది ఎంత కోరినా అభిమానులు వినకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు.
చంద్రబాబు ఆరా: అస్వస్థతకు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యం అందిస్తున్న కుప్పం ఆసుపత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వద్ద ఉన్న బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ నిర్వహించామని, స్టoట్ అవసరం లేకుండానే తారకరత్న కొలుకున్నట్లు చంద్రబాబుకి వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్తగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: