ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం చేసిన వైద్య పరమైన ఏర్పాట్లపై మంత్రి ఈటల రాజేందర్.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావుతో మాట్లాడారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే వనదేవతల పండుగ కావడం వల్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
జాతరలో ఆహారం, నీరు కలుషితం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. స్పందించిన డీపీహెచ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో ఎప్పటికప్పుడు ఆహారాన్ని పర్యవేక్షణ చేస్తున్నామని... కలుషిత ఆహారం విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రికి తెలిపారు.
ఇవీ చూడండి: మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్