హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్టులో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్షించారు. ఈ సమావేశంలో డీహెచ్ డా.శ్రీనివాస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితా రాణా, ఐపీఎం డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు.
గాంధీ ఆస్పత్రిపై ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిజాలను నిగ్గు తేల్చే పనిని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో జరుగుతున్న పలు విషయాలపై మంత్రి ఈటల మండిపడ్డారు. ఇకపై మెడికల్ ఇంటర్నీలకు లీవ్‌లు, అటెండెన్స్లకు సంబంధించి సూపరిండెంట్లకు ఎలాంటి ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్ అవగాహన