ETV Bharat / state

బస్తీమే సవాల్​: మణికొండ మున్సిపాలిటీలో నీటి కరువు తీరేదెప్పుడు..? - పురపోరు

పెద్ద పెద్ద బిల్డింగులు... సువిశాల టౌన్​షిప్​లు... అక్కడంతా సినీనటులు, ఐటీ ఉద్యోగులు... హైదరాబాద్ నగరంలో కాస్ట్లీ  ఏరియా మణికొండ పురపోరుకు సై అంటోంది. తాగటానికి చుక్క నీరుండదు... కానీ మురుగు నీరు వీధులు  పొంగిపొర్లుతుంటుంది. పైన మెరుగులే తప్ప ఎన్నో సమస్యలు ఉన్నాయంటున్నారు ఇక్కడి ప్రజలు.

బస్తీమే సవాల్​: తారలతో మెరిసే మణికొండలో గొంతు తడిపే చుక్క దొరికేదెప్పుడో...?
HEAVY WATER PROBLEM IN MANIKONDA MUNICIPALITY
author img

By

Published : Jan 16, 2020, 4:42 PM IST

బస్తీమే సవాల్​: తారలతో మెరిసే మణికొండలో గొంతు తడిపే చుక్క దొరికేదెప్పుడో...?

వెండితెర, బుల్లితెరల కళాకారులు, ఐటీ ఉద్యోగుల నివాస కేంద్రంగా ఉన్న మణికొండ పురపోరుకు సిద్ధమైంది. మణికొండ, నెక్నంపూర్, పుప్పాలగూడ గ్రామాలతో ఏర్పడ్డ మున్సిపాలిటీలో మొదటి సారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 20 వార్డులు ఉన్న మణికొండలో.... 48,907 మంది ఓటర్లున్నారు.

మూడేళ్లల్లో తాగునీటి ఖర్చు అక్షరాల రూ.20కోట్లు

పెద్ద పెద్ద బిల్డింగ్​లతో అభివృద్ధి చెందినట్టుగా కన్పిస్తున్న మణికొండలో మంచినీటి సమస్య తాండవిస్తోంది. 2003-04లో ప్రారంభమైన అల్కపూర్​ టౌన్​షిప్​లో ఇప్పటికి వరకు మంచినీటి సౌకర్యమే లేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచినీటి కోసం ఒక్కొ అపార్ట్​మెంట్​లో నెలకు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చు చేస్తున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశామంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... తమ ఆవేదన వివిధ రూపాల్లో వెలిబుచ్చినా ఫలితం మాత్రం శూన్యమంటున్నారు. ఇచ్చిన హామీలను నేతలు గాలికే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంచినీరు సౌకర్యం లేదు..ప్రత్యామ్నాయం సంగతేంటి..?

మంచినీటి సౌకర్యం ఈ కాలనీకి లేదని హెచ్​ఎండీఎ అధికారులు స్పష్టం చేసినట్లు అల్కాపూర్ టౌన్​షిప్ అధ్యక్షుడు ప్రమోద్​ తెలిపారు. ప్రత్యామ్నాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా... ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని నిరాశ వ్యక్తం చేశారు. వచ్చే వేసవికాలం నాటికైనా సమస్యను పరిష్కరించి... ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.

సమస్యలు తీర్చేవాళ్లే ఓట్లు అడిగేందుకు రండి..!

హరితహారంలో పాల్గొని మొక్కలు నాటితే... వాటిని సంరక్షించేందుకు జగ్గు నీళ్లు కూడా దిక్కులేవంటూ మహిళలు మండిపడుతున్నారు. తమ సమస్యలు తీర్చేవాళ్లే ఓట్లు అడిగేందుకు రావాలని తేల్చి చెబుతున్నారు. మాటలు చెప్పే వాళ్లు ఇక్కడ అడుగుపెట్టొద్దని హెచ్చరిస్తున్నారు.

ఆరైందంటే రోడ్డు మీద ఉండలేం...

మంచినీటి సమస్యతో పాటు మురుగునీటి సమస్య మున్సిపాలిటీవాసులను వేధిస్తోంది. రోడ్లమీద ఎప్పుడూ మురుగు పారుతూనే ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. నెక్నాంపూర్ పెద్దచెరువు, చిన్న చెరువుల అభివృద్దికి ప్రభుత్వం రూ.22 కోట్లు వెచ్చించినా...పనులు ఇప్పటికీ జరగడం లేదంటున్నారు. డ్రైనేజీ సమస్య వల్ల దోమలు బాగా పెరిగిపోయి... 6 అయిందంటే రోడ్డు మీద నిలవలేని పరిస్థితి ఉందంటున్నారు. డెంగీలాంటి రోగాలతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యలు చాలవన్నట్టు... రహదారులు, వీధి దీపాల సమస్యలు ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయంటూ నిట్టూరుస్తున్నారు మణికొండ మున్సిపాలిటీ వాసులు. సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇస్తేనే ఓట్లేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు.

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

TG_HYD_02_11_MNCL_SPL_MANIKONDA_PKG_3182388 reporter : sripathi.srinivas Note : కథనానికి సంబంధించిన హీరోలు, సెలబ్రిటీల ఫైల్ విజువల్స్, అవసరమైతే వాడుకోగలరు. ( ) సాధారణంగా ప్రయాణం చేసేప్పుడు మాత్రమే మనం మంచినీళ్ల బాటిళ్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ..ఓ కాలనీవాసులు ప్రతిరోజూ నీళ్లను కొనాల్సిందే..! తాగేందుకే కాదు..కనీస అవసరాల కోసం కూడా కొనుగోలు చేసిన నీళ్లనే వాడుతారు. అలాగని వారు డబ్బులు ఎక్కువై కొనడంలేదు. ఆ కాలనీకి నీటి సౌకర్యం లేకపోవడంతోనే ఇలా కొనాల్సి వస్తుంది. ఏడాదికి ఆ కాలనీవాసులు రూ.6కోట్లు కేవలం నీళ్లకే వెచ్చిస్తున్నారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆ కాలనీ వాసులు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తమ సమస్య పరిష్కరించే వారికే ఓటేస్తామంటున్నారు. Look... వాయిస్ 1 : వెండితెర, బుల్లితెరల కళాకారులు, సాంకేతిక నిపుణుల నివాస కేంద్రంగా మణికొండ విరాజిల్లుతోంది. కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, రోజా, అలీ, శివబాలాజీ, నాగబాబు, శివారెడ్డి, చిన్నా తదితర నటులు ఇక్కడే నివసిస్తుంటారు. విప్రో, పొలారీస్, ఇన్ఫోసిస్, ఎమ్మార్ ప్రాపర్టీస్, గోల్ఫ్ కోర్ట్, యాక్సెంజర్, కాగ్నిజంట్, ఐబీఎస్ వంటి దిగ్గజ బహుళజాతి కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. మణికొండ మున్సిపాలిటీలో మణికొండ, నెక్నంపూర్, పుప్పాలగూడ మూడు గ్రామాలు ఈ మునిసిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఈ ఏడాదే మొదటిసారిగా మణికొండ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మణికొండ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఓటర్లు 48,907 మంది ఓటర్లు, పురుషులు 26,022వేలు, మహిళలు 22,885 వేలమంది ఉన్నారు. మణికొండ మున్సిపాలిటీలో నాణేనికి ఒకవైపు అభివృద్ది ఉంటే..మరోవైపు...మంచినీళ్ల కోసం అవస్థపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. మురుగునీరు పొంగిపొర్లుతున్న కాలనీలు, నీళ్లు కొనుగోలు చేయనిదే పూటగడవని అపార్ట్ మెంట్ లు ఉన్నాయి. వాయిస్ 2 : అల్కాపూర్ టౌన్ షిప్ 2003-04లో ప్రారంభమైంది. సుమారు 350 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. టౌన్ షిప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మంచినీటి సౌకర్యమే లేదు. ఈకాలనీలో సుమారు 20వేల మంది ప్రజలు, ఆరువేల మంది ఓటర్లు ఇక్కడ నివాసముంటున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయిందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. రోజుకు కనీసం రెండు వందల మంచినీటి ట్యాంకర్లు అవసరమైతే..కేవలం 15 ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయంటున్నారు. భూగర్బ పైపులైనులు వేసి...మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ..అవి హామీల రూపంలోనే మిగిలిపోయాయని వారు పేర్కొంటున్నారు. సురక్షిత మంచినీటి కోసం ఈ కాలనీవాసులు చేయని ప్రయత్నంలేదు. మానవహారం, మౌనధీక్ష,3కే రన్ కూడా నిర్వహించారు. అయినా..పెద్దగా ఈకాలనీని పట్టించుకోలేదంటున్నారు. హెచ్.ఎం.డీ.ఏ అధికారులు వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్మించి..కేవలం అల్కాపూర్ టౌన్ షిప్ కోసమే 10 నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు. కానీ..ఇప్పటి వరకు వాటిని అమలుచేయలేదని కాలనీవాసులు చెబుతున్నారు. ఒక్కొక్క అపార్ట్ మెంట్ వాసులు కేవలం నీళ్లకోసమే నెలకు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సుమారు ఏడాదికి రూ.6కోట్లు ఖర్చు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశామంటున్నారు. బైట్ : రాజశేఖర్ రెడ్డి, అల్కాపూర్ టౌన్ షిప్ కాలనీవాసి. వాయిస్ 3 : మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ...సంపాదించిన దాంట్లో కొంత నీటికే ఖర్చు చేయాల్సి వస్తుందని మహిళలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హరితహారం చేయాలని ఉన్నా..మొక్కలు నాటినా...నీళ్లు లేక ఇప్పటికే నాటిన మొక్కలు కొన్ని ఎండిపోయాయి. ఎవరైనా ఫంక్షన్లు జరిగితే సంతోషపడుతారు..కానీ..ఈ అపార్టుమెంట్లలో ఫంక్షన్ జరిగితే కొంత ఆందోళన చెందుతారు. దీనికి ప్రధాన కారణం కాలనీలో సరైన నీటి సౌకర్యం లేకపోవడమే అంటున్నారు. ఈ కాలనీలో నివసించే వారిలో ఎక్కవశాతం సాప్ట్ వేర్ ఉద్యోగులే. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారే ఎక్కువమంది ఉన్నారు. దీంతో నీటికోసం ఇబ్బందులు తప్పడంలేదంటున్నారు. గతంలో హెచ్.ఎం.డీ.ఏ ఎండీని, వాటర్ బోర్డు అధికారులను కలిసినప్పటికీ...మంచినీటి సౌకర్యం ఈ కాలనీకి లేదని అధికారులు స్పష్టం చేశారని...అల్కాపూర్ టౌన్ షిప్ అధ్యక్షుడు ప్రమోదు తెలిపారు. వచ్చే వేసవికాలం నాటికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేశారన్నారు. గత వేసవిలో ఒక్కో ట్యాంకర్ నీటిని రు రూ.1,500లు వెచ్చించి కొనుగోలు చేశామన్నారు. బైట్ : పార్వతి, అల్కాపూర్ టౌన్ షిప్ కాలనీవాసి బైట్ : ప్రమోద్, అల్కాపూర్ టౌన్ షిప్ అధ్యక్షుడు. వాయిస్ 4 : అల్కాపూర్ టౌన్ షిప్ లోనే కాదు..మణికొండలో మున్సిపాలిటీలోని చాలా ప్రాంతాల్లో మురుగునీటి సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎప్పుడూ మురుగునీళ్లు పొంగిపొర్లుతున్నాయని ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తుందంటున్నారు. నెక్నాంపూర్ పెద్దచెరువు, చిన్న చెరువుల అభివృద్దికి ప్రభుత్వం రూ.22 కోట్లు వెచ్చించింది. పెద్దచెరువు పనులు జరుగుతున్నా..చిన్న చెరువు పనులు మాత్రం జరగడంలేదంటున్నారు. దీంతో స్థానికంగా దోమలు బాగా పెరిగిపోయాంటున్నారు. రాత్రయితే చాలు...దోమలను కొట్టి కొట్టి చేతులు నొప్పులు పెడుతున్నాయంటున్నారు. నోరు తెరిస్తే..దోమలు నోట్లోకి దూరిపోతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణ కోసం రాత్రి ఆరు అయిందంటే చాలు..రోడ్డుపై నిలబడే పరిస్థితే కన్పించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాల సమస్య కూడా ఎక్కుగానే ఉందంటున్నారు. బైట్ : శ్రీకాంత్, అల్కాపూర్ టౌన్ షిప్ కాలనీవాసి బైట్ : శంకర్ దేవ్, స్థానికుడు. బైట్ : భుజసింగ్, స్థానికుడు. END WITH P2C
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.