నాగార్జున సర్కిల్ మీదుగా మాసబ్‌ట్యాంక్ వెళ్లే రహదారిపై భారీ ఎత్తున రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ పైపులైను లీకేజే దీనికి కారణం.
లీకేజీ వల్ల మాసబ్‌ట్యాంక్ వెళ్లే రహదారి దెబ్బతింది. దీనికి తోడు వర్షం కురుస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. మరమ్మతు పనులను చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాసబ్‌ట్యాంక్ వైపునకు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: భారీ వర్షాల ఎఫెక్ట్: పాతబస్తీ ఆగమాగం