ETV Bharat / state

వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్​ రోడ్లు

author img

By

Published : Nov 13, 2020, 5:02 AM IST

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు.. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. మలక్‌పేట్, ఎంజే మార్కెట్, గోషామహల్ రహదారులపై ప్రయాణం నరకమవుతోంది. కొన్నిచోట్ల జీహెచ్​ఎంసీ మరమ్మతుల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్​ రోడ్లు
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్​ రోడ్లు
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్​ రోడ్లు

పట్టణీకీకరణ వల్ల హైదరాబాద్ దినదినాభివృద్ది చెందుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చే వాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. వాహనాల రద్దీని తగ్గించడంతోపాటు.. సుందరీకరణ కోసం జీహెచ్​ఎంసీ పలు పనులు చేపడుతోంది. ఎస్​డీఆర్​పీ కింద పలు చోట్ల పైవంతెనలు నిర్మిస్తోంది. పనుల్లో వేగం లేకపోవడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజే మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే దారిలో బేగంబజార్ నాలా పనులు చేస్తున్నారు. జులైలో ప్రారంభమైన పనులు 45 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నా.. మరో రెండు నెలలు కొనసాగే అవకాశముంది.

ఫలితంగా ఎంజే మార్కెట్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు ఉన్న వన్‌ వేను తీసేసి.. రెండు వైపుల నుంచి రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు అనుమతిచ్చారు. దీంతో అప్జల్‌గంజ్‌ నుంచి సీబీఎస్​కు వెళ్లే వాహనాలన్నీ.. సుల్తాన్‌బజార్‌ మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఎంజే మార్కెట్ నుంచి చాదర్‌ఘాట్ వరకు ట్రాఫిక్‌ అధికంగా ఉంటుంది.

లక్షా 30 వేలకు పెరిగిన వాహనాలు..

లాక్‌డౌన్ విధించకముందు ఈ రహదారిపై లక్షా 10 వేల వాహనాలు తిరుగుతుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య లక్షా 30వేలకు పెరిగిందని ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి.. గమ్యం చేరేందుకు అదనపు సమయం పడుతోందని నగరవాసులు చెబుతున్నారు. మెట్రో వల్ల వాహనాల రద్దీ తగ్గుతోందని భావించినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా నగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది.

సుల్తాన్ బజార్, ఎంజే మార్కెట్ రహదారులపై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు కొనసాగించే ఆర్టీసీ బస్సుల విషయంలో ట్రాఫిక్ పోలీసులు.. అధికారులతో చర్చిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్​కు వెళ్లే బస్సులను.. మళ్లించాలని భావిస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు మరమ్మతులు వేగంగా పూర్తి చేయడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఇదీ చదవండి: బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.