ETV Bharat / state

ఈ-పాస్ ఉన్న వారికే ఆంధ్రప్రదేశ్​లోకి అనుమతి..

author img

By

Published : Jul 3, 2020, 8:42 AM IST

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధింపు ప్రచారం నేపథ్యంలో... ఏపీ సరిహద్దుల వద్ద వాహనాలు బారులు పెరుగుతున్నాయి. అయితే వచ్చిన వారందరికి ఏపీలోకి అనుమతించడం లేదు. ఈ-పాస్‌ ఉన్నవారినే అనుమతిస్తున్న పోలీసులు... లేనివారిని వెనక్కి పంపుతున్నారు.

hyderabad lockdown
hyderabad lockdown

తెలంగాణ- ఏపీ సరిహద్దుల వద్ద మళ్లీ వాహనాలు బారులు తీరుతున్నాయి. హైదరాబాద్‌లో వైరస్‌ కట్టడికి... మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలంతా వారి సొంతూళ్ల బాటపట్టారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల రద్దీ నెలకొంటోంది. వారిలో చాలామంది వద్ద ఏపీ ప్రభుత్వ అనుమతి ఉన్న ఈ-పాస్‌ లేకపోవటంతో పోలీసులు వారిని వెనక్కి పంపుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటి నుంచి జూన్‌ 30 వరకు... గరికపాడు చెక్‌పోస్ట్ మీదుగా ఏపీలోకి రోజుకు 500 నుంచి 700 మంది వెళ్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యికి చేరింది.

డీజీపీ కార్యాలయం, స్పందన వెబ్‌సైట్‌ ద్వారా పొందిన ఈ-పాసులున్న వారినే అనుమతిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. సరిహద్దుల వద్ద ప్రతి ఒక్కరికీ కచ్చితంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. వారి వివరాలు నమోదు చేసుకున్నాకే అనుమతిస్తున్నామని తెలిపారు. వారిని కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యే అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.