ETV Bharat / state

Telangana Weather News Today : నిప్పులు కక్కుతున్న సూరీడు.. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం - హైదరాబాద్ వార్తలు

Heat Stroke In Telangana : రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. 40 నుంచి 44 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలు తీసి బయటపెట్టాలంటే వణుకు వస్తోంది. సూర్యుడి ధాటికి నిండు ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. ప్రస్తుతం వడగాలులు బాగా వీస్తుండడంతో.. అనారోగ్యంతో ఉన్నవారు, ఎండలో తిరిగేవారు పరిస్థితి విషమించి ప్రాణాలు వదులుతున్నారు.

Heat Stroke In Telangana
Heat Stroke In Telangana
author img

By

Published : Jun 11, 2023, 10:51 AM IST

Updated : Jun 11, 2023, 12:15 PM IST

17 Peoples Died Of Heat Stroke in Telangana : రాష్ట్రంలో నిప్పులు కక్కుతున్న సూర్యుడి ధాటికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాల్లో వడగాలులు బాగా వీస్తున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉంటుంది. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న వారు, ఎండకి తిరిగేవారు పరిస్థితి విషమించి ప్రాణాలు వదులుతున్నారు. మే 25వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది వడదెబ్బకు గురై మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి.

పేదలు.. కూలీలే ఎక్కువ :

  • వడదెబ్బకు లోనవుతున్న వారిలో ఆరు బయట పనిచేస్తున్న రైతులు, కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. వాహన డ్రైవర్లు, హమాలీలు కూడా అస్వస్థతకు గురవుతున్నారు.
  • రాష్ట్రంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.
  • ఈ నెలలో హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్​ జిల్లాల్లో సుమారు ఐదుగురు కూలీలు వడదెబ్బతో మృతిచెందినట్లు తెలుస్తోంది.
  • ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఏ.దినేశ్ (17), జనగామ జిల్లా పాలకుర్తిలో బాలుడు జీ.విక్రం (11), సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 17 ఏళ్ల వ్యక్తి వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
  • వడదెబ్బతో చనిపోయినట్లు ప్రభుత్వ యంత్రాంగం గుర్తిస్తే రెవెన్యూ శాఖ వారికి రూ.3 లక్షల వరకు పరిహారం విడుదల చేస్తుంది. సదరు మరణాన్ని ఆ ప్రాంత ప్రభత్వ ఆసుపత్రి వైద్యుడు, ఇన్​స్పెక్టర్​, తహసీల్దార్​లతో కూడిన త్రిసబ్య కమిటీ క్షేత్రస్తాయి పరిశీలన చేసిన నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే శవ పరీక్షలోనూ లక్షణాలు స్పష్టం కావాలి.

Telangana Heat Stroke : జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన గాదెపాక రేణుక తన ఒక్కగానొక్క కుమారుడిని ఎండలు బలితీసుకున్నాయని కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. ఈ నెల 4వ తేదీన ఆమె ఏకైక సంతానమైన విక్ర (11) వడదెబ్బ తగిలి మృత్యువాతపడ్డాడు. ఆరోజు బాలుడు బడిబాట కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్నేహితులతో ఆరుబయట ఆటలాడి నీరసించాడు. సాయంత్రం పూట వాంతులు కావడంతో కుటుంబీకులు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని వరంగల్​కి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు తల్లి రేణుక విలపిస్తున్నారు.

డీహైడ్రేషన్‌తోనే ముప్పు : ఉష్ణోగ్రత అధికమయ్యే కొద్దీ శరీరం చెమట రూపంలో లవణాలను కోల్పోయి డీహైడ్రేషన్‌ ముప్పు ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి, వాంతులు, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం, సొమ్మసిల్లి పోవడం, నీరసించడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అధిక వేడికి త్వరగా నీరసించిపోతారని పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటిన సమయంలో శరీరం ఆ వేడికి ప్రభావితమైతే దేహం పనితీరు పెరుగుతుందని అంటున్నారు. అలాంటి సమయంలో అంతర్గత అవయవాలను, బయట చర్మాన్ని చల్లబర్చడానికి ఎక్కువ నీరు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. అందుకే వేసవిలో ఎక్కువగా నీటిని తీసుకోకపోతే దేహం డీహైడ్రేషన్​కు గురవుతుందని హెచ్చరిస్తున్నారు.

చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి : చిన్నపిల్లలు ఉష్ణోగ్రతలకు త్వరగా ప్రభావితమవుతారని నాగర్​కర్నూల్ పీడియాట్రిక్ ప్రొ.నరహరి అన్నారు. ఎండల నేపథ్యంలో పిల్లలను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరుబయటికి వెళ్లనీయకపోవడం మంచిదని చెప్పారు. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీలు దాటితే తడివస్త్రం కప్పి వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అలాగే వారు బయటినుంచి రాగానే చల్లని నీటిని తాగకుండా చూడాలన్నారు. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 11, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.