ETV Bharat / state

హైదరాబాద్​లో కుంభవృష్టి.. జలదిగ్బంధంలో కాలనీలు.. - హైదరాబాద్​ వర్షం వార్తలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి... హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వరదనీరు రోడ్లపై మోకాలిలోతు నిలిచిపోవడంతో... జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరదనీరు ప్రవహిస్తుండడంతో... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణశాఖ... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

hyderabad rains
hyderabad rains
author img

By

Published : Oct 14, 2020, 5:12 AM IST

Updated : Oct 14, 2020, 5:58 AM IST

హైదరాబాద్​లో కుంభవృష్టి.. జలదిగ్బంధంలో కాలనీలు..

కుండపోత వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. రోడ్లపై వరద ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

నడుములోతు నీరు

ఎల్బీనగర్ వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధానరహదారిపై నడుము లోతు నీటిలో వాహనదారులు ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటలపాటు రోడ్లపై అనేక అవస్థలు పడ్డారు. వీధుల్లోనూ నడుము లోతు వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నిలిపిన వాహనాలు మునిగిపోయాయి. వర్షం కారణంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కొట్టుకుపోయిన వాహనాలు

భారీ వర్షానికి మూసీ నాలా పొంగి పొర్లుతుంది. ముసరాంబాగ్ బ్రిడ్జిపై ప్రమాద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలను అలీ కేఫ్‌ చౌరస్తా నుంచి మళ్లించారు. చైతన్యపురి కమల్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. చైతన్యపురి, శారదానగర్, పీ అండ్ టీ కాలనీ, వీవీ నగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సరూర్‌నగర్ చెరువుకు వరద పోటెత్తింది. చెరువుకు దిగువన లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్, కోదండరాంనగర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. సరూర్‌నగర్‌ గ్రీన్‌పార్క్‌ కాలనీలో నిలిచిఉన్న వాహనాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

చెపువులను తలపించిన కాలనీలు

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఉప్పల్‌లో నాలాలు పొంగిపొర్లాయి. లక్ష్మీనారాయణకాలనీ, కావేరీనగర్‌, శ్రీనగర్‌కాలనీ, న్యూభరత్‌నగర్, సౌత్‌స్వరూప్‌నగర్‌లు జలమయమయ్యాయి. ఉప్పల్‌ నాలాకు ఇరువైపులా ఉన్న ఇళ్లలోకి భారీగా వర్షంపు నీరు చేరింది. నాచారంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి మోకాలిలోతు వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకి రాలేదు. వీధుల్లో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి.

నిలిచిన విద్యుత్​ సరఫరా

వర్షం కారణంగా ఆ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మల్లాపూర్ పరిధి భవానీనగర్ నాలాలో పడి కొట్టుకుపోతున్న బాలికను జీహెచ్​ఎంసీ సిబ్బంది రక్షించారు. లాలాపేట వద్ద చెట్లు కూలి విద్యుత్‌ తీగలపై పడడంతో... విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి అంబర్‌పేట్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపై పడిన చెట్టును జీహెచ్​ఎంసీ సిబ్బంది తొలగించారు.

ఇదీ చదవండి : విషాదం... పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి

Last Updated : Oct 14, 2020, 5:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.