ETV Bharat / state

RAINS: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. పలు జిల్లాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రోడ్లు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

RAINS: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు
RAINS: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు
author img

By

Published : Sep 1, 2021, 4:29 AM IST

రాష్ట్రంలో మూడు రోజులుగా కురిసిన కుంభవృష్టికి పలు జిల్లాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. పలు జిల్లాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రోడ్లు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా బచ్చోడు చెరువు పొంగటంతో బీరోలు-బచ్చోడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హస్నాబాద్‌ చెరువు పొంగి రహదారిపైకి ప్రవహిస్తుండటంతో రోడ్డు కోతకు గురైంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం వద్ద వంతెన దెబ్బతింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట వంతెనపై సోమవారం వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు వరద ప్రవాహానికి మంగళవారం వాగులోకి కొట్టుకుపోయింది. 90 శాతం వరకు మునిగిపోయింది.

వరంగల్‌ జిల్లాలో లోలెవల్‌ వంతెనను ద్విచక్ర వాహనంపై దాటుతున్న తల్లి, కుమారుడు వరద ధాటికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగులో గొర్రెల కాపరి, అతన్ని కాపాడబోయిన మరో అయిదుగురు చిక్కుకున్నారు. వారిని మంగళవారం సాయంత్రం పోలీసులు ఒడ్డుకు చేర్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కుర్రారం గ్రామ శివారులోని దోసలవాగులో సోమవారం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువతి పొన్నబోయిన హిమబిందు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌లో పత్తి చేలో కలుపు తీస్తున్న సంగీత(40), సిరికొండ మండలం సాత్‌మోరిలో చేలో పనిచేస్తున్న నర్సవ్వ(23) మంగళవారం పిడుగుపాటుకు బలయ్యారు.

పలు చోట్ల భారీ వర్షాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి వరంగల్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో గత మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా నిర్మల్‌ జిల్లా కుంటాలలో 19.2 సెంటీమీటర్లు కురిసింది. భైంసాలో 13.1, బచ్చోడ(ఖమ్మం)లో 18.6, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 16, బీబీపేటలో 14.1, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 15.2, పెద్దశంకరంపేట(మెదక్‌)లో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలే కురిశాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ నెల 3న (ఎల్లుండి) గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నందున అప్పటి నుంచి వర్షాలు పెరిగే సూచనలున్నాయి.

కాలువకు గండి.. గ్రామాన్ని ముంచెత్తిన వరద

నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని గడ్డెన్న ప్రాజెక్టు కాలువకు గండిపడింది. పంటచేలను వరదనీరు ముంచెత్తింది. మండలంలోని రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండెగాంలోకి సోమవారం అర్ధరాత్రి వెనుక జలాలు ప్రవేశించాయి. గ్రామస్థులు రాత్రికి రాత్రే ఎత్తయిన ప్రదేశాల్లోని ఇళ్లలో తలదాచుకున్నారు. మంగళవారం ఉదయం భైంసా సమీపంలో నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లలో తాత్కాలిక నివాసం ఏర్పర్చుకున్నారు.

తల్లి, కుమారుడిని కాపాడిన యువకులు

లోలెవల్‌ వంతెనను దాటడానికి ప్రయత్నిస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి వరదలో కొట్టుకుపోతున్న తల్లి, కుమారుడిని స్థానిక యువకులు కాపాడిన ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని గుండ్రపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. మడిపల్లి శివారు కస్నతండాకు చెందిన తల్లి, కుమారుడు జరుపుల అచ్చమ్మ, గోపి ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్‌ జిల్లా గూడూరుకు వెళ్తూ.. లోలెవల్‌ వంతెన వద్ద వరద ఉద్ధృతిలో అదుపుతప్పి పడిపోయారు. ద్విచక్రవాహనం సహా వారిద్దరూ వరదలో కొట్టుకుపోతుండటంతో అక్కడే ఉన్న యువకులు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.

పాలేరు జలాశయానికి వరద పోటు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 24.20 అడుగులకు చేరింది. 15,490 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరగటంతో సుమారు 300 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి.

వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరి.. కాపాడబోయిన అయిదుగురూ..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరువాగులో సోమవారం సాయంత్రం గొర్రెల కాపరి మొగిలి చంద్రమౌళి(55) చిక్కుకున్నాడు. రాత్రంగా వాగు ఆవలి ఒడ్డునే ఉన్నాడు. మంగళవారం అతన్ని బయటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన అయిదుగురు యువకులూ వాగు మధ్యలో చిక్కుకుపోయారు. వారందర్నీ పోలీసులు సాయంత్రం బోటు ద్వారా ఒడ్డుకు చేర్చారు. గొర్రెలనూ ఇవతలి ఒడ్డుకు తీసుకువచ్చారు.

హిమాయత్​ సాగర్​ రెండు గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌ సాగర్‌ రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తినట్లు జలమండలి ఎండీ దాన కిషోర్ తెలిపారు. వెల్లడించారు. మూసీ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. మూసీ నదికి ఇరువైపులా పరిస్థితులను జలమండలి బోర్డు సిబ్బందీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ప్రజలెవరూ అటువైపుగా వెళ్లవద్దని అయన విజ్ఞప్తి చేశారు. రాబోయే మరో రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించడంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: KRMB: ఇవాళ్టి కృష్ణా బోర్డు భేటీతో నీటి వాటాల లెక్క తేలేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.