ETV Bharat / state

Weather Report: వాయుగుండం తీవ్రరూపం.. తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు! - అల్పపీడనం

నిన్న సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ ఉదయం తీవ్రరూపం దాల్చడంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా(rains in telangana) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే కాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd weather report) వెల్లడించింది. రేపు సాయంత్రం ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది.

heavy-rains-in-telangana-upcoming-three-days

author img

By

Published : Sep 25, 2021, 4:51 PM IST

ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది రాగల 6 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో(rains in telangana) రాగల మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(imd weather report) వెల్లడించింది. రేపు ,ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న సాయంత్రం వాయుగుండంగా మారిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్రరూపం దాల్చింది.

ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470 కి.మీ. దూరంలో తూర్పు - ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి 540 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం , గోపాల్​పూర్ మధ్యలోని కళింగపట్నం వద్ద రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉనట్లు తెలిపారు.

ఈనెల 27 తేదీన ఈశాన్య- తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఈనెల 29న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని వెల్లడించింది.

ఇదీ చూడండి: TS Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.