తౌక్టే తుపాను ప్రభావంతో.. రాష్ట్రంలోని పలు చోట్ల జోరుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. జీడిమెట్ల, చాద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో.. నీళ్లు రహదారులపైకి చేరాయి. రోడ్లపై నీరు నిలవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భారీ నష్టం..
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో.. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందగా... మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆత్మకూర్ మండలం మిడతనపల్లిలో పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో.. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం నీటి పాలైంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిరప పంటలు పాడైపోయాయి.
ఇదీ చదవండి: 'తౌక్టే' తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది?