ETV Bharat / state

Heavy Rains in Nellore: ఎటు చూసినా నీరే.. ఆగమాగమవుతున్న నెల్లూరు - నెల్లూరు జిల్లాలో వర్షాలు

Heavy Rains in Nellore: ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్​పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Heavy Rains in Nellore, rains in nellore, heavy rains in ap
నెల్లూరులో భారీ వర్షాలు
author img

By

Published : Nov 29, 2021, 12:41 PM IST

Heavy Rains in Nellore: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, పెన్నా వరదతో ఆత్మకూరు చెరువును తలపిస్తోంది. ఇళ్లు నీటమునగడంతో... ప్రజలు తీవ్ర అపస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న గిరిజనుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఎడతెరిపి ‌లెకుండ కురుస్తున్న వర్షాలకు ఎటు చూసిన నీరె (Flood Effect in Nellore) కనిపిస్తుంది. ఎక్కడ చూసిన వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్​పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారింది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరు, పాతపాడు చెరువులకు గండ్లు పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.

నెల్లూరులో భారీ వర్షాలు

సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

భారీ వర్షాలతో సోమశిల జలశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశం ఇన్​ ఫ్లో 95,266 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,16,146 క్యూసెక్కులు ఉంది. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 68.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీ వరదల దృష్ట్యా పెన్నా పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది...

నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆనుకుని ప్రవహించే స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్తూరు జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎక్కువగా రావడంతో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నది ఒకవైపు బ్రిడ్జి పై నీరు పారడంతో నీటిలోనే వాహనాలు వెళ్తున్నాయి. పెళ్లకూరు మండలంలోని గ్రామాల్లో ప్రవహించే వాగు నీరు... పొలాల్లోకి పారుతోంది.

ఇదీ చదవండి: central team visited Nellore : నెల్లూరులో కేంద్ర బృందం పర్యటన.. రూ. 1,190 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.