RAINS IN NELLORE AND KADAPA : అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంతో పాటు.. కావలి, ఆత్మకూరు, కందుకూరులో వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు బస్టాండ్ లోని అండర్ పాస్ వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కేవీఆర్ పెట్రోల్ బంకు, అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంతం, పొదలకూరు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి.
మురుగునీటితో ప్రజల ఇబ్బందులు : జిల్లాలోని ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటంతో మురుగు నీరు పొంగి ప్రవహిస్తూ.. దుర్వాసనను వెదజల్లుతోంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఆత్మకూరు, ఏఎస్పేట, సంగం మండలాల్లో భారీ వర్షాలు.. మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల మండలాల్లో ఓ మోస్తారుగా వానలు పడుతోన్నాయి. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వాగులో చిక్కుకున్న కారు: జిల్లాలోని పొదలకూరు మండలంలోని నావురువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నెల్లూరు నుంచి నావురు ఉన్నత పాఠశాలకు కారులో వెళ్తున్న పలువురు ఉపాధ్యాయులు వాగులో చిక్కుకున్నారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు బయటికి వచ్చారు. వాగు ఉద్ధృతికి కారు కొంత దూరం వెళ్లి ఆగింది. స్థానికుల సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు..
వైఎస్సార్ కడప జిల్లా: అల్పపీడన ప్రభావంతో.. కడపలో ఉదయం నుంచి ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పడుతున్న వర్షానికి రోడ్లపై మురుగు నీరు చేరి జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చదవండి: