ETV Bharat / state

HEAVY RAIN: హైదరాబాద్​లో పలు చోట్ల ఏకధాటిగా కురిసిన వర్షం

రాష్ట్రంలో వివిధ చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో భారీగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలిక మృతి చెందింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

HEAVY RAINS HYDERABAD
HEAVY RAINS HYDERABAD
author img

By

Published : Jul 8, 2021, 5:42 AM IST

హైదరాబాద్​లో పలు చోట్ల ఏకధాటిగా కురిసిన వర్షం

హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు ప్రవహించింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్​నగర్‌లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్‌లో భారీ వర్షం కురిసింది. బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, గాజులరామారం, సనత్‌నగర్‌, బోయిన్‌పల్లిలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మాదాపూర్​లో అత్యధికం..

పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌, కుషాయిగూడ, చర్లపల్లిలో రహదారులపై నీరు నిలిచింది. పలుచోట్ల ద్విచక్రవాహనదారులు వంతెనల కింద వాహనాలు నిలిపి వేచిచూశారు. రాత్రి పూట ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 11గంటల వరకు అత్యధికంగా మాదాపూర్ ప్రాంతంలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రాలో 10.3, ఉప్పల్‌లో 9.3, బాలానగర్ 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్​ఎంసీలోని ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాయి.

హోర్డింగ్​ కుప్పకూలి..

మేడ్చల్ జిల్లా కీసర నాగారం చౌరస్తాలో భారీ వర్షానికి అందరూ చూస్తుండగానే భారీ హోర్డింగ్ కుప్పకూలింది. అటుగా వస్తున్న ద్విచక్రవాహనంపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి.

పిడుగుపాటుకు ఒకరు మృతి..

ఆదిలాబాద్ జిల్లా ఎస్ఎంసీ మండలంలో బలమైన గాలులతో వర్షం కురిసింది. పుట్లూరు మండలంలోని కొత్తగూడ, చింతకుంట గ్రామాల్లో ఇంటి రేకులు ఎగిరిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం విప్పలగుంపులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలిక మృతి చెందింది. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి సమీపంలోని పొలాల్లో ఆడుకుంటుండగా... పిడుగు పడడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఆ బాలికతో ఆడుకుంటున్న చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీచూడండి: KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.