హైదరాబాద్లోని మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లడం వల్ల మురుగునీరు రోడ్లపై ఏరులై పారింది. భారీగా వరదనీరు నిలవడం వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లు సగం వరకు మునిగాయి. ట్రాఫిక్ పోలీసులు గొడుగుల సహాయంతో విధులు నిర్వర్తిస్తూ వాహనదారులకు సహకారం అందించారు.
ఇదీ చూడండి : క్వాలిఫై కాకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారు?