హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కవాడిగూడ, గాంధీనగర్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్‌లో ఓ మోస్తరు వాన పడింది.
వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
మరోవైపు నైరుతి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది. నేడు అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది.
WEATHER REPORT: నేడు మోస్తరు వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వానలు!