ETV Bharat / state

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్​ఎంసీ..! - hyderabad rain news

హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హెచ్​ఐసీసీ ప్రాంగణం సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ సిబ్బంది.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్​ఎంసీ..!

author img

By

Published : Jul 2, 2022, 6:43 PM IST

రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తోన్న వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్‌, బాచుపల్లి, జీడిమెట్ల, సూరారం, బహదూర్​పల్లి, దుండిగల్, సికింద్రాబాద్, బోయిన్​పల్లి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్, అల్వాల్, జవహర్ నగర్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, కీసర, నేరేడ్‌మెట్‌, కాప్రా, హెచ్‌బీ కాలనీ, భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద ఎడతెరిపి లేని వాన పడుతోంది.

ఒక్కసారిగా మొదలైన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మెట్రో పిల్లర్ల కింద తలదాచుకుంటున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. మరోవైపు జీహెచ్​ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లపై వరద నీరు నిల్వకుండా చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ధరణి పోర్టల్​లో పొరపాటు.. ఆ ఊరికి గ్రహపాటు

విజయ్ బోల్డ్ పోస్టర్​పై సమంత, జాన్వీ అదిరిపోయే కామెంట్స్​.. రష్మిక ఎమోషనల్​ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.