భాగ్యనగరాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులు కింద కురిసిన వర్షాల నుంచి కోలుకోక ముందే నగరాన్ని మళ్లీ వర్షం ముంచేసింది. శనివారం పడిన వానకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరి చేరింది. ఇప్పటికే వరదలో ఉన్న ప్రాంతాల్లో వరద మరింత పెరిగింది.
ఎల్బీనగర్, ఉప్పల్, గడ్డిఅన్నారం, సరూర్‌నగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, హరిహరపురం, కొత్తపేట, మలక్‌పేట, కూకట్‌పల్లి, రాయదుర్గం, షేక్‌పేట, మదీనా, చార్మినార్, బహదూర్‌పురా, చార్మినార్, బహదూర్‌పురా, కాచిగూడ, లాలాపేట, హబ్సిగూడ, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌస్, మెహిదీపట్నం, కార్వాన్, జియాగూడ, కోఠి, రాంకోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, నాచారం, తార్నాక, ఓయూ క్యాంపస్, ముషీరాబాద్, మీర్‌పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఒక గంటలో ఎల్బీనగర్‌లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా... ఉప్పల్‌లో 10, గడ్డిఅన్నారంలో 9 సె.మీ, సరూర్‌నగర్ 9, హయత్‌నగర్ 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్, మల్కాజిగిరిలో ఉరుములతో కూడిన వర్షం పడింది.
మెహదీపట్నం, బయోడైవర్శిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌజ్, మెహదీపట్నం మీదుగా దారి మళ్లిస్తున్నారు.
ఇదీ చదవండి: వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం