ETV Bharat / state

హైదరాబాద్​లో పలుచోట్ల భారీ వర్షం.. రాగల మూడు రోజులూ...! - telangana rains

Hyderabad Rain: కొన్ని రోజులుగా ఉక్కపోతలతో సతమతవుతోన్న రాజధాని వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

నగరంలో చల్లబడిన వాతావరణం.. పలుచోట్ల భారీ వర్షం

author img

By

Published : Jun 19, 2022, 2:14 PM IST

Updated : Jun 19, 2022, 5:16 PM IST

హైదరాబాద్​లో చల్లబడిన వాతావరణం.. పలుచోట్ల భారీ వర్షం

Hyderabad Rain: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లిలో భారీ వర్షం కురవగా.. మురుగు నీరు రహదారిపైకి చేరింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్‌ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపుర్ ప్రాంతాల్లో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా చేరడంతో లింగంపల్లి-ఓల్డ్ ముంబయి రోడ్డు వద్ద గల రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపు కురిసిన వర్షానికే రహదారులు జలమయమైతే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.

పొంగిపొర్లిన మురికి కాలువలు..: వరంగల్, హనుమకొండ జిల్లాలో రెండు గంటల పాటు కురిసిన వానకు.. రహదారులన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని రహదారుల పక్కనున్న మురికి కాలువలు పొంగిపొర్లడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రాగల మూడు రోజులు భారీ వర్షాలు..: మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి అంతర్గత తమిళనాడు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ద్రోణి.. ఈ రోజు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.

ఇవీ చూడండి..

రెయిన్‌ అలర్ట్‌.. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు!

అత్యున్నతస్థితికి సాగునీటి రంగం.. సాహసోపేత చర్యలతో సరికొత్త అధ్యాయం!

Last Updated : Jun 19, 2022, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.