భాగ్యనగరాన్ని వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా పలుచోట్ల కురిసిన వర్షాలకు నగరవాసులు తడిసి ముద్దయ్యారు. హైదరాబాద్‌లోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రహదారులపైకి నీరు రావడం వల్ల పనుల కోసం బయటకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
- ఇదీ చూడండి : వరదల్లో చిక్కుకున్న మోదీ- కాపాడిన ఎన్డీఆర్ఎఫ్