ETV Bharat / state

RAIN: జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. - telangana latest news

జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..!

author img

By

Published : Jun 27, 2021, 3:24 PM IST

Updated : Jun 27, 2021, 4:28 PM IST

15:13 June 27

RAIN: జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..

జంట నగరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం..!

హైదరాబాద్​ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్, ​బోయిన్​పల్లి, మారేడ్​పల్లి, చిలకలగూడా, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, తిరుమలగిరి, ఫ్యాట్నీ, బేగంపేట, కూకట్ పల్లిలో భారీ వర్షం కురిసింది.

పాతబస్తీ చార్మినార్, బహదూర్​పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్​పురా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడా, నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లోనూ ఓ మాదిరి వాన కురిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలో సుచిత్ర, కొంపల్లి, గాజుల రామారం, షాపూర్​నగర్​లోనూ జోరుగా వర్షం పడింది.

కోఠి, సుల్తాన్​బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లక్డీకపూల్​, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్​నగర్​, కింగ్ కోఠి, రాంకోటి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్​పేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మియాపుర్, చందానగర్, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతాపూర్​ ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా.. పలుచోట్ల విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. కూకట్​పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది.

భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల నాలాలు పొంగిపొర్లగా.. మరికొన్ని చోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

ఇదీ చూడండి: covid effect: రూ.2వేల కోట్లకు చేరిన మెట్రో నష్టాలు

Last Updated : Jun 27, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.