ETV Bharat / state

గ్రేటర్‌లో ఈదురుగాలులతో జోరువాన.. రోడ్లన్నీ జలమయం - భారీ వర్షం

ఉరుములు, మెరుపులు.. గంటకు 30కి.మీ.ల వేగంతో దూసుకొచ్చే ఈదురుగాలులు హైదరాబాద్​ నగరాన్ని వణికించాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వానతో వరద పొంగింది. శనివారం అర్ధరాత్రి చిరుజల్లులతో మొదలై ఆదివారం మధ్యాహ్నానికి అకాల వర్షం బీభత్సం సృష్టించింది.

heavy-rain-in-hyderabad-effect-of-thaukte
గ్రేటర్‌లో ఈదురుగాలులతో జోరువాన.. రోడ్లన్నీ జలమయం
author img

By

Published : May 17, 2021, 8:54 AM IST

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. శనివారం తీవ్రత పెరగ్గా.. ఆదివారం అదేస్థాయి వానలు పడ్డాయి. అయితే ఈ వానలకే లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులూ జలమయమయ్యాయి. దీంతో టోలిచౌకి, షేక్‌పేట, అత్తాపూర్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. డ్రైన్లలో చెత్తాచెదారం నిండటంతో నీరు ఎక్కడికక్కడ నిలిచి రోడ్లపైకి చేరింది. నాంపల్లి, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది, విపత్తు నిర్వహణ దళ సభ్యులు సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో 5.93సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మెహిదీపట్నంలో 0.3సెం.మీలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఏ ప్రాంతంలో ఎంతంటే..

వరద నీరు రోడ్లపైకి చేరి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అత్తాపూర్‌ ప్రధాన రహదారి మొత్తం మోకాళ్లలోతు వరద నీటితో నిండిపోయింది. షేక్‌పేట పరిధిలోనూ వరద బీభత్సం సృష్టించింది. గతేడాది వానలు ఉక్కిరిబిక్కిరి చేసి వేల కుటుంబాల్ని రోడ్డున పడేశాయి. అయితే నాలాల విస్తరణ, డ్రైన్ల మరమ్మతుల విషయంలో అదే నిర్లక్ష్యం కొనసాగడంతో పాత పరిస్థితి పునరావృతమైంది. నిజాంపేట, మియాపూర్‌ ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు రావడంపై ఫిర్యాదులొచ్చినా సిబ్బంది స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోలిచౌకిలో స్థానిక కార్పొరేటర్లు సహాయక చర్యలు చేపట్టారు.

వర్షంలో తడుస్తూ..

మారిన వాతావరణం..!

తౌక్టే తుపాను ప్రభావంతో నగర వాతావరణం పూర్తిగా మారిపోయింది. శనివారం రాత్రి నుంచి భీకర ఈదురుగాలులు, జల్లుల ప్రభావంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. ఈ తుపాను కారణంగా నేడు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మధ్యస్థాయి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: తౌక్టే ఎఫెక్ట్.. రాష్ట్రంలో జోరుగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.