ETV Bharat / state

Heavy rain in Hyderabad : హైదరాబాద్​లో మరోమారు కుండపోత వాన.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు - Heavy rains in Telangana

Heavy rain in Hyderabad : హైదరాబాద్​ మహానగరంలో కుండపోత వర్షంతో వరుణుడు మరోమారు విరుచుకుపడ్డాడు. నగరంలో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్​కేసర్, పోచారంలో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఘట్​కేసర్-కీసర మార్గంలో భారీ వృక్షాలు రోడ్లపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Heavy rains in Hyderabad
Heavy rains in Hyderabad
author img

By

Published : May 10, 2023, 6:09 PM IST

Updated : May 10, 2023, 7:18 PM IST

Heavy rain in Hyderabad : హైదరాబాద్​లో మరోమారు కుండపోత వాన.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

Heavy rains in Hyderabad : హైదరాబాద్​ నగరంలో ఇవాళ సాయంత్రం వరుణుడు కుండపోత వర్షంతో విరుచుకుపడ్డాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడి వాతావరణం ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి భారీ వర్షం కురిసింది. నగరంలో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్​కేసర్, పోచారంలో రహదారులు చెరువులను తలపించాయి. పలు కాలనీల్లో వరద నీరు ముంచెత్తడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.

బస్తీల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అంధకారం నెలకొంది. ఉప్పల్ కూడలి నుంచి వరంగల్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.‌ ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఘట్​కేసర్-కీసర మార్గంలో చెట్లు నేలకూలగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నిర్మల్​ జిల్లాలో భారీ వర్షం: హైదరాబాద్​తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం వర్షం పడింది. నిర్మల్ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరబెట్టిన ధాన్యం సాయంత్రం కురిసిన వర్షానికి మరోసారి తడిసిపోయాయి. రోడ్లపై వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఉదయం ఉక్కపోత.. సాయంత్రం వాన : రాష్ట్రంలో గత వారం రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం భానుడు భగభగలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉక్కపోతతో చిన్న పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వేడిగాలులతో ప్రజలు ఉదయం 10గంటల నుంచే అడుగు బయట పెట్టలేకపోతున్నారు. సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించి మేఘం నీళిసంద్రమై వర్షం రూపంలో ప్రజలను పలకరిస్తున్నాడు.

దానికి తోడు ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలపై వడగండ్ల వర్షం పడగా.. చాలా వరకు అవి నేలపాలయ్యాయి. తడిసిన ధాన్యం ఆరబెట్టడానికి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకుంటామని హామీలు ఇచ్చిన.. క్షేత్ర స్థాయినలో హామీలు అమలు కావడంలేదని రైతులు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2023, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.