ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దులోని మడుపల్లి చెరువు వద్ద చేపల కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా గుమిగూడడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మధిరలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం.. ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది.
ఇదీ చూడండి : కరోనా కాలం: సురక్షిత ఆహారానికి 5 సూత్రాలు