అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్లాట్లు, లే అవుట్లు నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశంగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పటి వరకు 7.55 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇందులో పురపాలక సంఘాల నుంచి 3 లక్షల 4వేలు కాగా.. గ్రామ పంచాయతీల నుంచి 2 లక్షల 96 వేలు, నగర పాలక సంస్థల నుంచి 1 లక్షా 54 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుము కింద ప్రభుత్వ ఖజానాకు రూ.76.86 కోట్ల ఆదాయం చేకూరింది.