ETV Bharat / state

FLOOD WATER: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. గోదావరి శాంతించింది

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చింది. మరోవైపు గోదావరి శాంతించింది. నదిలో వరద ఉద్ధృతి తగ్గింది.

శ్రీశైలం జలాశయం
FLOOD WATER
author img

By

Published : Jul 26, 2021, 6:44 AM IST

శ్రీశైలం జలాశయాని (Srisailam Reservoir)కి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నానికి 24 గంటల వ్యవధిలో 26.30 టీఎంసీల నిల్వ, 8.9 అడుగుల మేర నీటి మట్టం పెరిగాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టు పూర్తి నిల్వ మట్టం 885 అడుగులకుగాను 865.50 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ 124.22 టీఎంసీలకు చేరింది.

కృష్ణమ్మకు తోడురానున్న తుంగభద్ర

మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు (Tungabhadra project) గేట్లు ఎత్తి దిగువకు 46 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ రోజు ఇవి కృష్ణా ప్రవాహానికి తోడుకానున్నాయి. శ్రీశైలానికి ఎగువన ఉన్న జూరాల జలాశయాని (Jurala Reservoir)కి ఆదివారం 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 44 గేట్ల ద్వారా దిగువకు 4.05 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.

శాంతించిన గోదావరి

గోదావరి నది శాంతించింది. నదిలో వరద ఉద్ధృతి తగ్గింది. ఎగువ నుంచి శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (Sri Ramasagar‌ Project)కు 23 వేల క్యూసెక్కులే వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampalli project) నుంచి 56 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం సమ్మక్క సాగర్‌ (తుపాకుల గూడెం) వద్ద నదిలో 9.50 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం తగ్గడంతో శనివారం జారీ చేసిన ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ధవళేశ్వరం ఆనకట్ట (Dhavaleswaram Dam) నుంచి సముద్రంలోకి 3 లక్షలకు పైగా క్యూసెక్కులను వదులుతున్నారు.

Flood Effect: కుండపోత వర్షం... పంటలకు తీరని నష్టం

ఎల్లుండి అల్పపీడనం

బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 28న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నట్లు వెల్లడించారు. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని... ఈరోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కూనూర్‌(జనగామ జిల్లా)లో 2, అంగడి కిష్టాపూర్‌(సిద్దిపేట)లో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో వరద విలయం- 149కి చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.