ETV Bharat / state

హైదరాబాద్‌ను ముంచేసిన మూసీ.. భయం గుప్పిట్లో ప్రజలు - హైదరాబాద్‌లో వరదలు

హైదరాబాద్‌లో ఉప్పొంగుతున్న మూసీ నదితో పరివాహక ప్రాంత ప్రజల భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. జంట జలాశయాలకు భారీ వరదలతో పొంగిపొర్లుతున్న మూసీ.... వంతెనలను, పరివాహక ప్రాంతంలోని కాలనీలను ముంచెత్తుతోంది. భారీ వర్షాలకు చెరువులు ఇప్పటికే నిండుకుండల్లా మారటంతో దిగువనున్న బస్తీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.... పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

HEAVY FLOODS IN HYDERABAD
హైదారాబాద్‌ను ముంచేసిన మూసీ.. భయం గుప్పిట్లో ప్రజలు
author img

By

Published : Jul 27, 2022, 7:06 PM IST

Updated : Aug 2, 2022, 3:08 PM IST

హైదారాబాద్‌ను ముంచేసిన మూసీ.. భయం గుప్పిట్లో ప్రజలు

వరుణుడు శాంతించినా... వరద ఉద్ధృతి హైదరాబాద్‌ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్ , రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తోడు ... జంట జలాశయాల నుంచి విడుదలైన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి ఈసీ జలాలు తోడవడంతో పరిహక ప్రాంతాల ప్రజలు... భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. పురానాపూల్‌ను మూసీ ముంచెత్తింది. భారీగా వరద నీరు చేరడంతో పరివాహాక ప్రాంత కాలనీలు జలమయమయ్యాయి. పురానాపుల్ వద్ద వరదలో ఓ వ్యక్తి మునిగిపోతుండగా మంగల్‌హాట్‌ ఎస్ఐ రాజు... నీటిలోకి దూకి కాపాడాడు. భారీ ఎత్తున వరదనీరు చుట్టుముట్టడంతో పురానాపూల్, జియాగూడ ప్రజలు ఆహారం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వరద పురానాపుల్‌ శ్మశానవాటికను ముంచెత్తడంతో అంత్యక్రియలకు ఆటంకం కలిగింది. జియాగూడ ప్రాంతంలో చెరువుల్ని తలపిస్తున్న రోడ్లతో వాహన రాకపోకల్ని నియంత్రించారు.

చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనకు రెండువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి.... రాకపోకలు నిలిపివేశారు. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో 'అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌' వైపు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసానగర్ , కమలానగర్ పరిసరాలను మూసీ వరద చుట్టుముట్టింది. మూసీ పరివాహకంలోని చాదర్‌ఘాట్‌, ముసానగర్‌, శంకర్‌నగర్ కాలనీవాసులను అప్రమత్తం చేసిన అధికారులు … బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.

నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ వరద నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరుచేరటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలేవల్ వంతెనపై నుంచి మూసి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలంలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద...లోలేవల్ వంతెన మీదుగా మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వంతెన మీదుగా వాహనదారులు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

రేపు ఉదయం వరకు మూసీ వరద కొనసాగే అవకాశం ఉన్నందున.... ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్‌పేట - కాచిగూడ, మూసారాంబాగ్ - మలక్‌పేట మార్గాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన ట్రాఫిక్‌ పోలీసులు...ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.... బాధితులకు హరేకృష్ణ సంస్థ ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో... జీహెచ్‌ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది.

ఇదీచూడండి: వరదలో బైక్‌తో సహా చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు.. సీపీ అభినందనలు

Last Updated : Aug 2, 2022, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.